టిడిపిలో పలువురు చేరిక

గిరిజనులు తామ సమస్యలను చెప్పుకొనేందుకు

పార్టీలో చేరిన వారితో గౌతు శిరీష

పలాస :

గిరిజనులు తామ సమస్యలను చెప్పుకొనేందుకు ఐటిడిఎ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటిడిఎ ఏర్పాటుకు కృషి చేస్తానని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష హామీ ఇచ్చారు. మండలంలోని పలాస టిడిపి కార్యాలయంలో మంగళవారం మందస మండలం కోండలోగాం, గోపుటూరు, రామరాయి, కోయ్యఢూరు, సాబకోట పంచాయతీ బుడంబో, బిత్రబంద, మాణిక్యపట్టణం గ్రామాలకు చెందిన వైసిపి టిడిపిలోకి చేశారు. వీరికి టిడిపి కండు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో దుంపల జగన్నాథం, దుర్యోధన, శాంతారావు, పాపారావు, ఆనందరావు, కిరణ్‌, అభి, గాంధీ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మందస నాయకులు సవర లాక్యా, భావన దుర్యోధన, లబ్బ రుద్రయ్య, తమిరి భాస్కరరావు, రట్టి లింగరాజు, శేఖర్‌, ఉమా, ఈశ్వరరావు, పండా, చిరంజీవి, బోగి రాజు నాగేందర పాల్గొన్నారు.

 

➡️