నవోదయకు విద్యార్థుల ఎంపిక

మండలంలోని బెలమాం పంచాయితీ లోద్దలపేట ప్రాథమిక పాఠశాలలో

భవిష్యశ్రీ గాయత్రి

ఆమదాలవలస:

మండలంలోని బెలమాం పంచాయితీ లోద్దలపేట ప్రాథమిక పాఠశాలలో 5వ తగరతి చదువుతున్న గురుగుబెల్లి ఓంశ్ర్రీ ప్రకాష్‌ జవహార్‌ నవోదయ విద్యలయ (వెన్నెలవలస) పాఠశాలకు 6వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించాడని పాఠశాల హెచ్‌ఎం దుప్పల అప్పలనాయుడు తెలిపారు. ఈ ప్రవేశపరీక్షను రాయడానికి పాఠశాల ఉపాధ్యాయులు శిక్షణ, తల్లిదండ్రులు సహకారం ఎంతగానో ఉపయోగపడిందని ఓం శ్రీ ప్రకాష్‌ తెలిపారు. ఓం శ్రీ ప్రకాష్‌ ఇటీవల సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షలో కూడా 228 మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించాడు. జవహార్‌ నవోదయ విద్యలయ పాఠశాలకు తమ గ్రామానికి చెందిన విద్యార్ధి ఎంపికకావడం పట్ల గ్రామస్తులు, పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తూ ఓం శ్రీ ప్రకాష్‌కు అభినందనలు తెలిపారు. అలాగే సరుబుజ్జిలి మండలం గోనెపాడుకు చెందిన సీపాన హిమశ్రీ నవోదయ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. ఈమె తండ్రి ఆనందరావు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. హిమశ్రీ నవోదయకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. సంత బొమ్మాళి: లక్ష్మి పురం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన రెడ్డి భవిష్యశ్రీ గాయత్రి ఎంపికైంది. ఈమె తండ్రి సూరిబాబు లక్ష్మీపురం పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేస్తునారు. తల్లి పావని వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. భవిష్యశ్రీ ఎంపిక పట్ల కుటుంబసభ్యులు, ఎంఇఒలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. పాతపట్నం: పాతపట్నంలో గల ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ విద్యార్థి బిసాయిమోహిత్‌ ఆదివారం విడుదల చేసిన నవోదయ ప్రవేశ పరీక్షలో ఎంపికయ్యాడని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వెంకట రమణ తెలిపారు. విద్యార్థి నవోదయకు ఎంపికకావడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.టెక్కలి: స్థానిక సర్వమంగళ వీధిలోని విజ్ఞాన్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న కె.దృవన్‌చాతుర్య జవహర్‌ నవోదయ వెన్నెలవలస పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించారని పాఠశాల కర స్పాండెంట్‌ రాజశేఖర్‌ తెలిపారు. శిక్షకుడు ఆర్‌.కృష్ణారావును అభినందించారు.

 

➡️