నేటి నుంచి ‘శంఖారావం’

రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమయాత్తం చేసేందుకు యువతనేత లోకేష్‌ చేపట్టనున్న

ఇచ్ఛాపురంలో సిద్ధమైన సభావేదిక

ఇచ్ఛాÛపురంలో ప్రారంభం

జిల్లాలో నాలుగు రోజుల పాటు సాగనున్న లోకేష్‌ పర్యటన

తొలి రోజు మూడు నియోజవర్గాల్లో సభలు

ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ నాయకత్వం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి

రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమయాత్తం చేసేందుకు యువతనేత లోకేష్‌ చేపట్టనున్న శంఖారావం యాత్ర ఆదివారం ఇచ్ఛాపురంలో ప్రారంభం కానుంది. తొలిరోజు మూడు నియోజవర్గాల్లో సాగనుంది. యాత్రలో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహించనున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల వారిగా కేడర్‌తో ముఖాముఖి, కేడర్‌కు సూపర్‌-6 కిట్ల అందజేత వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. లోకేష్‌ యాత్రకు సంబంధించి పార్టీ నాయకత్వం ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. తొలి రోజు బహిరంగసభ నిర్వహించనున్న స్థానిక సురంగి రాజా క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ శనివారం పరిశీలించారు. కార్యక్రమంలో వెంట కాళ్ల ధర్మారావు, నందిక జాని, సాలీనా ఢిల్లీ యాదవ్‌, ఆసి చిరంజీవిరెడ్డి, కోటి, లీలారాణి, పద్మనాభం, జయదేవ్‌, జానకీరావు పాల్గొన్నారు. పలాసలో కుంబిరిగాం కూడలి వద్ద నిర్వహించనున్న శంఖారావం సభాస్థలిని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పరిశీలించారు. పీరుకట్ల విఠల్‌రావు, దువ్వాడ హేమబాబు చౌదిరి, కుత్తుమ లక్ష్మణరావు, తలగాన నర్సింహవ సర్తి, దువ్వాడ సంతోష్‌ ఉన్నారు. టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక మెళియాపుట్టి కూడలి నిర్వహించనున్న సభాస్థలిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించారు. నాయకులు బగాది శేషగిరి, జీరు భీమారావు, పినకాన ఆజరుకుమార్‌, మహిళా ఆధ్యక్షులు మెండ దమయంతి, హనుమంతు రామకృష్ణ, చాపర గణపతి, పోలాకి షణ్ముఖరావు, కొళ్ల లవకుమార్‌, గండి చంద్రరావు, పినకాన జోగారావు, దల్లి ప్రసాద్‌రెడ్డి, రెయ్యి ప్రీతీష్‌చంద్‌, కోళ్ల కామేష్‌, మల్లిపెద్ది మధు ఉన్నారు. టెక్కలిలో శంఖారావం సభాస్థలాన్ని డిఎస్‌పి బాలచంద్రారెడ్డి పరిశీలించారు. సమావేశం జరగనున్న స్థలంలో వాహనాల ఆనుమతి, రాకపోకల కట్టడి చేయడంలో తీసుకోవాల్సిన చర్యలతో పాటు, పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై కిందిస్థాయి అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. పాత జాతీయ రహదారి పక్క ఉన్న స్థలంలో సమావేశం జరగనున్న దృష్ట్యా ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచించారు. ఈయనతో పాటు సిఐలు చంద్రమౌళి, పైడయ్య, ఎస్‌ఐ లక్ష్మి ఉన్నారు. ఇచ్చాపురంలో ఉదయం10.30 : ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్‌ శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం.10.40 : బాబు షూరిటీ – భవిష్యత్‌కు గ్యారంటీ, మన టిడిపి యాప్‌లో ప్రతిభకనబర్చిన 50 మంది కార్యకర్తలకు లోకేష్‌ అభినందన10.50 : ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ప్రసంగం10.55 : శంఖారావం సభలో నారా లోకేష్‌ ప్రసంగం11.15 : ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ కేడర్‌తో ముఖాముఖి11.25 : పార్టీ కేడర్‌కు లోకేష్‌ చేతుల మీదుగా సూపర్‌-6 కిట్ల అందజేత11.28 : పార్టీ కేడర్‌తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్‌11.29 : పార్టీ కేడర్‌తో లోకేష్‌ సెల్ఫీ కార్యక్రమం12.30 : పలాస నియోజకవర్గానికి చేరిక12.30 : పలాస మండలం కేదారిపురం కంబిరిగాం కూడలి వద్ద భోజన విరామంపలాసలో మధ్యాహ్నం2.30 : బాబు షూరిటీ – భవిష్యత్‌కు గ్యారంటీ, మన టిడిపి యాప్‌లో ప్రతిభ కనబర్చిన 50మంది కార్యకర్తలకు అభినందన2.50 : పలాస నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి గౌతు శిరీష ప్రసంగం2.55 : లోకేష్‌ ప్రసంగం3.15 : పలాస నియోజకవర్గ పార్టీ కేడర్‌తో ముఖాముఖి3.25 : పార్టీ కేడర్‌కు లోకేష్‌ చేతులమీదుగా సూపర్‌ – 6 కిట్ల అందజేత3.28 : పార్టీ కేడర్‌తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్‌3.29 : పార్టీ కేడర్‌ లోకేష్‌ సెల్ఫీ4.10 : లోకేష్‌ టెక్కలి చేరికటెక్కలిలో సాయంత్రం5.00 : బాబు షూరిటీ – భవిష్యత్‌కు గ్యారంటీ, మన టిడిపి యాప్‌లో ప్రతిభకనబర్చిన 50 మంది కార్యకర్తలకు లోకేష్‌ అభినందన5.20 : టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అచ్చెన్నాయుడు ప్రసంగం5.25 : నారా లోకేష్‌ ప్రసంగం.5.45 : టెక్కలి నియోజకవర్గ పార్టీ కేడర్‌తో ముఖాముఖి5.55 : పార్టీ కేడర్‌కు సూపర్‌- 6 కిట్లు అందజేత5.58 : పార్టీ కేడర్‌తో చేయినున్న ప్రతిజ్ఞ5.59 : పార్టీ కేడర్‌తో సెల్ఫీ6.45 : నరసన్నపేట నియోజకవర్గం జమ్ము చేరిక7.00 : నరసన్నపేట పరిధిలోని జమ్ము గ్రామ శివారులో బస

 

➡️