న్యాయవాదుల వంటావార్పు

భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని

వంటావార్పుతో నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

ప్రజాశక్తి – ఆమదాలవలస

భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన న్యాయవాదులు కోర్టు వద్ద మంగళవారం వంటావార్పు చేపట్టిన నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కణితి విజయలక్ష్మిభారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూ హక్కు చట్టం న్యాయవాదులకు గొడ్డలిపెట్టువంటిదన్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ చట్టంతో ప్రజల భూములు, స్థిరాస్తి హక్కులను న్యాయవ్యవస్థ పరిధి నుంచి తొలగించి రాజకీయ దళారులకు అప్పగించడమే ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు పలురూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర కమిటీ సభ్యులు బొడ్డేపల్లి మోహనరావు, న్యాయవాదులు పైడి వరాహనరసింహం, తమ్మినేని అన్నంనాయుడు, గురుగుబెల్లి ప్రభాకరరావు, కిల్లి మార్కండేయలు, వి.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️