ప్రమాద రహిత రవాణా అందరి బాధ్యత

ప్రమాద రహిత రవాణా అందరి

ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్టీసి ఉద్యోగులు

  • జిల్లా ప్రజా రవాణా అధికారి విజరు కుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రమాద రహిత రవాణా అందరి బాధ్యత అని జిల్లా ప్రజా రవాణా అధికారి విజరు కుమార్‌ అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం-1, 2 డిపోల్లోని ఆర్‌టిసి సిబ్బందితో రహదారి భద్రతకు డ్రైవర్లు పాటించాల్సిన నియమాలపై ప్లకార్డులతో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్‌ కూడలి, డేఅండ్‌నైట్‌ కూడలి, విజయ గణపతి ఆలయం వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద రహిత రవాణా వ్యవస్థ తీసుకురావడానికి ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. రహదారి నిబంధనలను వాహనదారులు, పాదచారులు విధిగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్‌ రవిశంకర్‌ శర్మ, శ్రీకాకుళం ఒకటి, రెండో డిపో సహాయ మేనేజర్లు రమేష్‌, గంగరాజు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️