మరింత ఉత్సాహంతో విధులు

పదిహేను రోజుల పాటు నిర్వహించిన మొబలైజేషన్‌ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను పరిగణనలోకి

మాట్లాడుతున్న ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

పదిహేను రోజుల పాటు నిర్వహించిన మొబలైజేషన్‌ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని మరింత ఉత్సాహంతో విధులు నిర్వర్తించాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక సూచించారు. ఎచ్చెర్ల ఆర్మ్డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ మైదానంలో జిల్లా సాయుధ పోలీసు బలగాలకు నిర్వహించిన ‘మొబిలైజేషన్‌’ ముగింపు కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ముందుగా ఆర్మ్డ్‌ రిజర్వ్‌ సిబ్బంది ఎస్‌పికి గౌరవ వందనం సమర్పించారు. పర్యవేక్షణలో ప్లటూన్ల వారీగా పిటి డ్రిల్‌, లాటి డ్రిల్‌, వెపన్‌ డ్రిల్‌ నిర్వహించారు. సిబ్బంది డ్రిల్‌పై సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శిక్షణా కాలంలో నేర్చుకున్న విషయాలను తమ రోజువారి విధుల్లో, శాంతిభద్రతల్లో కొత్తగా తలెత్తే సమస్యలపై ఉపయోగిస్తూ, అన్ని విధాలుగా సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత సమర్థవంతంగా పనిచేసి, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, జిల్లా పోలీసుశాఖకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఎఆర్‌ సిబ్బందికి ఏటా మొబలైజేషన్‌ కార్యక్రమం అనేది ఒక రీఫ్రెష్మెంట్‌ కోర్స్‌ లాంటిదని అన్నారు. మీదైనందిన విధుల్లో మెరుగుపర్చుకునేందుకు నైపుణ్యం, ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ను మెరుగుపర్చుక్లోన్నారు. ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవం తంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ మొబలైజేషన్‌ దోహదం చేస్తుందన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు.

 

➡️