మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

నగరంలోని బగ్గు సరోజినీదేవి ఆస్పత్రిలో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్స

ఆపరేషన్‌ చేస్తున్న వైద్యులు

శ్రీకాకుళం అర్బన్‌:

నగరంలోని బగ్గు సరోజినీదేవి ఆస్పత్రిలో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్స ఆదివారం విజయవంతమైందని ఎండీ, న్యూరాలజిస్టు బగ్గు శ్రీనివాసరావు తెలిపారు. నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం ఈ శస్త్ర చికిత్స నిర్వహించినట్టు చెప్పారు. ఆర్థో పెడీషియన్‌ సుగ్గు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన ఆర్థో పెడీషియన్‌ బూసిరెడ్డి నరేందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపారు. కీళ్ల మార్పిడికి సంబంధించిన అన్నిరకాల శస్త్ర చికిత్సలకూ అధునాత ప్రక్రియ ఆస్పత్రిలో అందుబాటులో ఉందని అన్నారు. ఈ చికిత్సతో బాధితులకు ఆనందం నింపారని వివరించారు. మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు సంబంధించి ఇకపై సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బగ్గు సరోజినీ దేవి ఆస్పత్రిలో అత్యాధునిక ప్రపంచ స్థాయి సాంకేతికతతో ఆపరేషన్‌ థియేటర్‌ను నెలకొల్పామని చెప్పారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

 

➡️