రథసప్తమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

ఈనెల 16న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని

మాట్లాడుతున్న ఆర్‌డిఒ రంగయ్య

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఈనెల 16న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య అన్నారు. రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై ఆలయంలోని అనివెట్టి మండపంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ, రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్‌ అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ముందస్తుగా జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, నిరంతరం తాగునీటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. వికలాంగులు, వృద్ధుల కోసం వీల్‌చైర్స్‌ ఏర్పాటు చేసి, అవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం సిసి కెమెరాలు పనిచేసేలా చూడాలని, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో రెవెన్యూ, దేవాదాయశాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో వాహనాల పార్కింగ్‌కి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ పట్నాయక్‌, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, సిఐ ఎల్‌.ఎస్‌ నాయుడు, ట్రాఫిక్‌ సిఐ అవతారాం, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ కమిటీ సభ్యులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.మహిళల హాకీ పోటీలు ప్రారంభంప్రజాశక్తి – శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ మహిళల 14వ హాకీ ఛాంపియన్‌షిప్‌ పోటీలు మండలం లోని పాత్రునివలసలో గల స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. పోటీల్లో రాణించి జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. ఉత్తమ ప్రతిభను కనబరచడం ద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇందులో భాగంగానే గ్రామీణ స్థాయి మొదలుకొని ఆడుదాం ఆంధ్రా పోటీలు నిర్వహించిందని తెలిపారు.

 

➡️