రబీలోనూ వర్షాభావ పరిస్థితులే.

రబీలో సాధారణంగా అన్నిరకాల పంటలు కలిపి మొత్తం 2,16,340 ఎకరాల్లో

మండలం నీలకంఠాపురంలో నీరు లేక ఎండిన పంట కాలువ

రబీలో సాధారణ విస్తీర్ణం 2,16,340 ఎకరాలు

1,15,985 ఎకరాల్లోనే పంటలు వేయగలిగిన రైతులు

గతేడాది ఇదే సమయానికి 1,67,090 ఎకరాల్లో సాగు

13 మండలాల్లో తీవ్ర వర్షపాతం లోటుజిల్లాలో గత ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వేలాది ఎకరాల్లో రైతులు పంటలు వేయలేకపోయారు. సకాలంలో వర్షాలు కురవక వేసిన పంటలూ ఎండిపోయాయి. దీంతో రబీపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. రబీలోనూ ప్రస్తుతం అవే పరిస్థితులు నెలకొన్నాయి. రబీలో వరి వేయొద్దని ఇప్పటికే అధికారులు రైతులకు సూచించారు. వర్షాలు లేకపోవడంతో వంశధారలో నామమాత్రంగా ఇన్‌ఫ్లో ఉండగా, నాగావళిలో నీటి ప్రవాహం జీరో లెవల్స్‌కు పడిపోయింది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో, రైతులు విత్తనాలు వేయలేకపోతున్నారు. ప్రతి ఏడాది డిసెంబరులో కురిసే వర్షాలతో నేలలో తేమశాతం పెరిగి అపరాల సాగుకు దోహదపడుతుంది. ఈ ఏడాది వర్షాల్లేకపోవడంతో అపరాల సాగుపైనా తీవ్ర ప్రభావం చూపింది.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

రబీలో సాధారణంగా అన్నిరకాల పంటలు కలిపి మొత్తం 2,16,340 ఎకరాల్లో సాగవుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 1,15,985 ఎకరాల (54 శాతం) మేర సాగు అయింది. 2022-23 రబీలో ఇదే సమయానికి 1,67,090 ఎకరాల్లో (77.23 శాతం) పంటలు సాగయ్యాయి. వరి పంటను 21,150 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా 9,183 ఎకరాల్లో (43 శాతం) వేశారు. గతేడాది ఇదే సమయానికి 17,080 ఎకరాల్లో (80.76 శాతం) వేశారు. మొక్కజొన్న పంటను 38,163 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, 30,430 ఎకరాల్లో (79.74 శాతం) వేశారు. రాగులను 5,425 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు 2,995 ఎకరాలో (54 శాతం) వేశారు. చెరుకు పంటను 3,675 ఎకరాల్లో వేయాల్సి ఉండగా 158 ఎకరాల్లో (4 శాతం) వేశారు. వేరుశనగ పంటను 10,660 ఎకరాల్లో వేయాల్సి ఉండగా 8,485 ఎకరాల్లో (80 శాతం) వేశారు. రబీలో 11,152 ఎకరాల్లో నువ్వులు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 3,480 ఎకరాల్లో (25 శాతం) వేయగలిగారు. గతేడాదితో పోల్చితే అదనంగా 190 ఎకరాల్లో సాగు అయింది. పొద్దుతిరుగుడు పంటను 848 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, 28 ఎకరాల్లో (3 శాతం) మాత్రమే విత్తనాలు వేయగలిగారు.అపరాల సాగుపై తీవ్ర ప్రభావండిసెంబరులో వర్షాలు పెద్దగా లేకపోవడంతో అపరాల సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. నేలలో తేమ శాతం తక్కువగా ఉండడంతో మినుము, పెసర పంటలను వేయలేకపోయారు. రబీలో పెసర సాధారణ సాగు 46,645 ఎకరాలు ఉండగా, ఇప్పటివరకు 21,965 ఎకరాల్లో (47 శాతం) సాగవుతోంది. గతేడాది ఇదే సమయానికి 31,918 ఎకరాల్లో (68.43 శాతం) మేర సాగు అయింది. మినుము సాధారణంగా 70,340 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా 35,195 ఎకరాల్లో (50 శాతం) వేశారు. 2022-23 రబీలో 51,012.5 ఎకరాల్లో (72.52 శాతం) మేర మినప పంట సాగు అయింది. ఉలవలను 3,220 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 603 ఎకరాల్లో (19 శాతం) వేశారు. కట్టె జనుమును 2,270 ఎకరాల్లో వేయాల్సి ఉండగా 3,465 ఎకరాల్లో వేశారు. వర్షాలు లేకపోవడం, వంశధార, నాగావళిలో నీటి ప్రవాహం జీరో లెవల్స్‌కు పడిపోవడంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.రిజర్వాయర్లలో అడుగంటిన నీటి నిల్వలుమునుపెన్నడూ లేని విధంగా వంశధార, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం దారుణంగా పడిపోయింది. ఒడిశాల్లోనూ వర్షాలు లేకపోవడంతో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. వంశధారలో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 150 క్యూబిక్‌ మీటర్లు మాత్రమే ఉంది. గతేడాది ఇదే సమయానికి సుమారు 400 క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం ఉంది. హిరమండలం రిజర్వాయర్‌లో ఉన్న 2.5 టిఎంసిల నీటిని ఖరీఫ్‌లో చివరి తడుపులకు వినియోగించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం డెడ్‌ స్టోరేజీకి చేరడంతో సంక్రాంతి తర్వాత అధికారులు నీటి విడుదలను ఆపేశారు. గొట్టాబ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 0.66 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 0.13 టిఎంసిలకు పడిపోయింది. తోటపల్లి రిజర్వాయర్‌ సామర్థ్యం 2.5 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 1.38 టిఎంసిల నీరే ఉంది. మడ్డువలస రిజర్వాయర్‌ కింద ఆయకట్టు భూములకు సాగునీరు అవసరం లేదని రైతులు చెప్పడంతో అధికారులు నిలిపేసినట్లు తెలుస్తోంది.13 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులుజిల్లాలో సాధారణంగా ఈ సీజన్‌లో 1002.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతం 768 మి.మీ వర్షం కురిసింది. 30 మండలాలకు గానూ 13 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 15 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నందిగాం మండలం అత్యంత లోటు వర్షపాతం ఉన్న జాబితాలో ఉంది. ఎల్‌ఎన్‌పేట మండలం అధిక వర్షపాతం కురిసిన జాబితాలో ఉంది.బూర్జ

➡️