రాజ్యాంగ పరిరక్షణకు మరో పోరాటం

మందస జమీందారీ వ్యతిరేక

స్థూపం వద్ద నివాళ్లర్పిస్తున్న సిపిఎం నాయకులు

  • సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు

ప్రజాశక్తి- మందస

మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాద తూటాలకు బలైన తొలి మహిళ వీరనారి గున్నమ్మ పోరాట స్ఫూర్తితోనే ప్రస్తుతం ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణకు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు పిలుపునిచ్చారు. మండలంలోని వీరగున్నమ్మపురం లో సోమవారం వీరనారి గున్నమ్మ వర్థంతి సందర్భంగా ఆమె స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. వారు మాట్లాడుతూ జమీందారీ వ్యతిరేక పోరాటంలో 1940 ఏప్రిల్‌ 1న వీరనారి గుణ్ణమ్మతోపాటు గుంట బుడియాడు, గొర్రెల జగ్గయ్య, కర్రి కలియాడు, గుంట చిన్నారా యణ వీరమరణం పొందారని అన్నారు. ఏ ఆశయం కోసం అయితే ప్రాణాలర్పించారో బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత అవి ప్రమాదంలో పడ్డాయన్నా రు. బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో రాజ్యాంగ పునాదులను ధ్వంసం చేస్తుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం దేశ సంపదైన సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను భూములను కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతుం దని వివరించారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి భయబ్రాాంతులకు గురిచేస్తుందని విమర్శించారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన, ప్రత్యక్షంగాను, పరోక్షంగా వైసిపి వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. వామపక్ష లౌకిక శక్తుల ప్రత్యమ్నాయమే దేశానికి అవసరమని వారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు, ఆర్‌.దిలీప్‌కుమార్‌, ధర్మారావు, పి.అప్పలస్వామి పాల్గొన్నారు.

➡️