రేపట్నుంచి దాతలకు పాసులు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్దిలో భాగస్వాములవుతున్న దాతలకు రథసప్తమి వేడుకల్లో ఉచిత ప్రవేశం

విరాళాన్ని స్వీకరిస్తున్న ఇఒ రమేష్‌బాబు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్దిలో భాగస్వాములవుతున్న దాతలకు రథసప్తమి వేడుకల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు ఆలయ ఇఒ డిఎల్‌వి రమేష్‌ బాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నుంచి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇఒ కార్యాలయంలో డోనరు పాస్‌లను దాతలకు అందజేస్తామని తెలిపారు. ఒక్కో డోనర్‌ పాస్‌పై నలుగురికి ప్రవేశం కల్పిస్తామని, పాస్‌ తీసుకున్న వారికి 16వ తేదీ రాత్రి 12.30 నుంచి ఉదయం 7గంటల వరకు ప్రవేశం ఉంటుందన్నారు. ప్రత్యేక క్యూలైన్లలో వీరికి ప్రవేశం కల్పిస్తున్నట్టు తెలిపారు. రూ.లక్ష విరాళం సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి విశాఖపట్నానికి చెందిన బి.వెంకట వ్యాస నగేష్‌, ఉష దంపతులు రూ.100116 విరాళంగా అందజేశారు. ఆదివారం ఆలయాన్ని సందర్శించిన వారు అనివేటి మండపంలో ఇఒ రమేష్‌బాబును కలసి చెక్కును అందజేశారు. తొలి మాఘ ఆదివారం రద్దీ ఆలయానికి మాఘమాసంలో రద్దీ అధికంగా ఉంటుంది. తొలి ఆదివారం కావడంతో యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఆలయానికి ఒక్క రోజునే రూ.5.64లక్షల ఆదాయం సమకూరింది. టికెట్లు విక్రయాల ద్వారా రూ.2,05,200 విరాళాల రూపంలో రూ.1,33,521, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2,25,000 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఇఒ డిఎల్‌వి రమేష్‌ బాబు తెలిపారు.

 

➡️