వైసిపిలో పలువురు చేరిక

పలాస మంత్రి కార్యాలయంలో మంగళవారం పశుసంవర్ధక

పార్టీలో చేరిన వారికి కండువాలు వేస్తున్న మంత్రి అప్పలరాజు

పలాస:

పలాస మంత్రి కార్యాలయంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో మందస మండలం సాబకోట నుంచి 30 మంది యువకులు వైసిపిలో చేరారు. వారికి మంత్రి అప్పలరాజు వైసిపి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మద్దిలి రామారావు, నాగకృష్ణ, నవీన్‌, మహేష్‌, బుద్ద బైరీ తదితరులున్నారు. కార్యక్రమంలో బృందావన్‌ క్లస్టర్‌ ఇన్‌ఛార్జి ఎస్‌ డొంబురు, నీలకంఠం, గిరిజన విభాగం నాయకులు, త్రినాధ్‌, శివాజి, తిరుపతి, కోదండరావు పాల్గొన్నారు.

 

➡️