వైసిపి ఇంటింటా ప్రచారం

సంక్షేమ పథకాలు వైసిపితోనే సాధ్యమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఆమదాలవలస : ప్రజలతో మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

సంక్షేమ పథకాలు వైసిపితోనే సాధ్యమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం పట్టణంలోని 13వ వార్డు పరిధిలోని కొత్తకోటవారి వీధి, చంద్రయ్యపేట, విద్యానగర్‌ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసిపికి మరోసారి అవకాశం ఇవ్వాలని, ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సిఎంగా జగన్మోహన్‌రెడ్డి కావాలన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పొడుగు శ్రీనివాసరావు, జెజె మోహనరావు, బొడ్డేపల్లి అజంతా కుమారి, దుంపల శ్యామలరావు, ఎండా విశ్వనాథం, సనపల సురేష్‌, బొడ్డేపల్లి రమణమూర్తి, బొడ్డేపల్లి రాజు పాల్గొన్నారు.టెక్కలి రూరల్‌: సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి విజయానికి కృషి చేయాలని వైసిపి టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. మేజర్‌ పంచాయతీలో బైరవీధి, అదిఆంధ్రవీధిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చిన నుంచి రిగ్గింగ్‌తోనే గెలుపు సాగిస్తున్న కింజరాపు కుటుంబానికి ఈ ఎన్నికల్లో ఓటమి రుచి చూపించి, తరిమికొట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైసిపి మహిళా అధ్యక్షులు చింతాడ మంజు గణపతి, సర్పంచ్‌ గొండెలి సుజాత, ఎంపిటిసిలు కూన పార్వతి, పీత హేమలత, వాకాడ శ్రీథర్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కిల్లి అజరు, జెసిఎస్‌ కన్వీనర్‌ సిగిలిపల్లి మోహనరావు, యువజన అధ్యక్షుడు రాంపాత్రుని మురళి, పిఎసిఎస్‌ అధ్యక్షుడు సత్తార్‌ సత్యం, పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.లావేరు: నియోజకవర్గ అభివృద్ధి కోసం మరో అవకాశం ఇచ్చి గెలిపించాలని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ అన్నారు. తాళ్లవలసలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జెడ్‌పిటిసి ఎం.సీతంనాయుడు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి శ్రీనువాసరావు, సర్పంచ్‌ ప్రతినిధి దేశెట్టి తిరుపతిరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పోలాకి: వైసిపి అభ్యర్థి ధర్మాన కష్ణదాస్‌ తనయులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు డోల, సంతలక్ష్మీపురం, సన్యాసిరాజు పేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కృష్ణదాస్‌, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగి నాయుడు, వైసిపి మండల కన్వీనర్‌ కణితి కృష్ణారావు, సర్పంచ్‌ ప్రతినిధి డోల ఉదయ బాస్కరరావు పాల్గొన్నారు.కోటబొమ్మాళి: మండలం కురుడు కాలనీ, కురుడు గ్రామంలో ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు సత్యరాజు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బాడాన మురళీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కళింగ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు, సచివాలయ కన్వీనర్‌ గడ్డవలస నాగభూషణరావు, వైస్‌ ఎంపిపి దుక్క రోజా, మండల విప్‌ బొడ్డు అప్పన్న, సర్పంచ్‌ కోతి చిన్నారావు, ఎంపిటిసి చుక్క లోకనాధం, వైసిపి నాయకులు కవిటి రామరాజు, సింహాచలం పాల్గొన్నారు. కొత్తూరు: మండల కేంద్రమైన కొత్తూరులో వైసిపి పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి తనయుడు ఓం శ్రీ కృష్ణ గాజుల వీధి, పడాలవీధి, కుమ్మరివీధిలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ సారిపల్లి ప్రసాదరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ, సర్పంచ్‌ నాసా బాలకృష్ణ, ఎంపిటిసి లక్మి నారాయణ, జి.ఆనందరావు, తిరుపతిరావు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌ పట్టణంలోని 4,6,10 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ దుక్క లోకేశ్వరరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి, టౌన్‌ పార్టీ అధ్యక్షులు బలివాడ ప్రకాష్‌ పట్నాయక్‌, సాలిన ఢిల్లీరావు, కౌన్సిలర్‌ పరపతి మంజులత, ప్రత్తి అన్వేష పాల్గొన్నారు. మండలంలోని కీర్తిపురం, పాయతారి పంచాయతీల్లో ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి నారాయణమ్మ, కె.మోహనరావు, చిట్టిబాబు, దున్న గురుమూర్తి, ఆసి పురుషోత్తంరెడ్డి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. కవిటి: సంక్షేమ పాలనకు చిరునామాగా వైసిపి ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా సాయిరాజ్‌, ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌ అన్నారు. మండలంలోని కపాసుకుద్ది పంచాయతీలో కపాసుకుద్ది, ముత్యాలపేట, కొరికానపుట్టుగ, రామ్‌నగర్‌ ప్రాంతాల్లో వైసిపి నేతలు మంగళవారం ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వైసిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.మెళియాపుట్టి : ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి గెలుపుకోసం వైసిపి నాయకులు రెడ్డి శ్రావణ్‌, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు కుమార్‌, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షులు ఉర్లన బాలరాజు, వైసిపి మండల కన్వీనర్‌ పల్లి యోగ తదితరులు పాల్గొన్నారు.పలాస : మండలంలోని రెంటికోట, కాంట్రాగడ గ్రామాల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సీదిరి అప్పలరాజుకు మద్దతుగా సర్పంచ్‌ శాసనపురి తిరుమలరావు, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు చింతాడ మాధవరావు, సచివాలయం మండల కన్వీనర్‌ దువ్వాడ రవి కుమార్‌ ప్రచారం నిర్వహించారు.

 

➡️