వైసిపి నాయకునిపై దాడి

వైసిపి నాయకుడు, ఎచ్చెర్ల వైస్‌ ఎంపిపి ప్రతినిధి, మాజీ సర్పంచ్‌ జరుగుల శంకరరావుపై గుర్తు తెలియని దుండగులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

వైసిపి నాయకుడు, ఎచ్చెర్ల వైస్‌ ఎంపిపి ప్రతినిధి, మాజీ సర్పంచ్‌ జరుగుల శంకరరావుపై గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. తన వాహనంపై వెళ్తున్న శంకర్‌ను ఎచ్చెర్ల సమీపంలోని ట్రిపుల్‌ ఐటి వద్ద దారికాసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్‌ను చికిత్స కోసం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. శంకరరావు భార్య విజయకుమారి ప్రస్తుతం ఎచ్చెర్ల వైస్‌ ఎంపిపిగా ఉన్నారు. ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాయకుల్లో ఒకరిగా ముద్ర పడ్డారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ చిరంజీవి ఆస్పత్రికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. దాడి వెనుక ఎచ్చెర్ల మండలంలోని అధికార పార్టీ చెందిన ఒక ముఖ్య నాయకుని హస్తం ఉందనే చర్చ సాగుతోంది. ఈ ఘటనతో ఎచ్చెర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

➡️