సేవలే గుర్తింపునిస్తాయి

ఉపాధ్యాయ వత్తిలో తాను సంతృప్తి పొందానని సన్మాన గ్రహీత ముంజేటి పాపారావు

శ్రీకాకుళం అర్బన్‌ : గౌరవ సత్కారాన్ని స్వీకరిస్తున్న ధర్మారావు

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

ఉపాధ్యాయ వత్తిలో తాను సంతృప్తి పొందానని సన్మాన గ్రహీత ముంజేటి పాపారావు అన్నారు. మండలంలోని అక్కుపల్లి మహాత్మా జ్యోతరావు పూలే మత్స్యకార గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ముంజేటి పాపారావు పదవీ విరమణ గావించారు. ఈ మేరకు ఆదివారం తోటి ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, వైద్యలు పాపారావు దంపతులకు దుశ్శాలువ కప్పి సన్మానించారు. పలువురు మాట్లాడుతూ సేవలే గుర్తింపు తేస్తాయని అన్నారు. సుదీర్ఘ కాలం ఉపాధ్యాయునిగా, ప్రిన్సిపాల్‌గా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, నిబద్ధతతో ఆయన కృషి చేశారని పలువురు కొనియాడారు. సన్మాన గ్రహీత మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిని తాను ఎంతగానో ఆస్వాదించానని అన్నారు. ఉద్యోగ విరమణ తరువాత కూడా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించినప్పుడే నిజమైన సన్మామని అన్నారు. కార్యక్రమంలో గ్రీన్‌ఆర్మీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బొనెల గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.పొందూరు:స్ధానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పసుమర్తి రామమనోహర్‌ సేవలు చిరస్మరణీయమని జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి కోట ప్రకాశరావు అన్నారు. ఆదివారం ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ ఇజ్జాడ మల్లేశ్వరరావు అధ్యక్షత ఏర్పాటు చేసిన రామ్‌ మనోహర్‌ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఆర్‌ఐఒ తవిటినాయుడు మాట్లాడుతూ రామ్‌ మనోహర్‌ దశాబ్దకాలం పాటు ఈ కళాశాలను క్రమశిక్షణా యుతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రామ్‌ మనోహర్‌, పద్మజ దంపతులను జ్ఞాపిక, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు.శ్రీకాకుళం అర్బన్‌: జిల్లా చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులుగా పనిచేసి ఐ.ధర్మారావు ఆదివారం పదవీ విరమణ పొందారు. ఈ మేరకు సహచర ఉద్యోగులు నగరంలోని హోటల్‌ గ్రాండ్‌లో ఆదివారం సన్మానించారు. 29 ఏళ్ల పాటు చేనేత జౌళిశాఖలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. రాజమహేంద్రవరం ఆర్‌జెడి ధనుంజరురావు, ఆర్‌జెడి రాజారావు, కాకినాడ ఎడి పెద్దిరాజు, విజయనగరం ఎడి మురళి, జిల్లా పౌర సంబంధాల అధికారి బాలమాన్‌ సింగ్‌, ఆప్కో జిఎం సోమేశ్వరరావు పాల్గొని ధర్మారావు సేవలను ప్రస్తావించారు. సన్మాన గ్రహీత మాట్లాడుతూ 1995లో హైదరాబాద్‌లో విధుల్లో చేరిన తాను 2018లో అమరావతికి వచ్చానని అన్నారు. సహాయ సంచాలకునిగా సొంత జిల్లా శ్రీకాకుళం 2022లో బదిలీపై వచ్చానని చెప్పారు. జిల్లాలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహించడం ఆనందాన్ని కలిగించిందన్నారు.

 

➡️