హెల్మెట్‌ ధారణ తప్పనిసరి

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న ఎస్‌పి రాధిక

  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక సూచించారు. జనవరి 20 నుంచి ఈనెల 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్‌ ధారణపై మంగళవారం నిర్వహించిన అవగాహనా ర్యాలీని స్థానిక ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఎస్‌పి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సమయంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. రాష్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. హెల్మెట్‌ను ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో మరణాలను అరికట్టవచ్చని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, నేషనల్‌ యూత్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️