అక్కడ నిర్లక్ష్యం…. ఇక్కడ నిరీక్షణ

అధికారుల నిర్లక్ష్యానికి అంగన్వాడీ కార్యకర్తలు అవస్థలు పడ్డారు. కేంద్రాలకు వచ్చిన పిల్లలు పౌష్టికాహారానికి

నారాయణ పురం కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నా చిన్నారులు

ప్రజాశక్తి- పలాస

అధికారుల నిర్లక్ష్యానికి అంగన్వాడీ కార్యకర్తలు అవస్థలు పడ్డారు. కేంద్రాలకు వచ్చిన పిల్లలు పౌష్టికాహారానికి దూరమయ్యారు. అంగన్వాడీ కేంద్రాలు సకాలంలో తెరవక పోవడంతో సమస్య తలెత్తింది. మరోవైపు సచివాలయ ఉద్యోగులు కేంద్రాల బాధ్యతలను అంగన్వాడీ కార్యకర్తలకు అప్పగించకపోవడం, తాళాలు తెరవక పోవడంతో మధ్యాహ్నాం వరకు కొన్ని కేంద్రాలు తెరుచుకొని పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీతో పాటు మండలంలో నాలుగు సెక్టార్ల పరిధిలో 102 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని సుమారు 42 రోజులుగా సమ్మె బాట పట్టడంతో వాటి భాద్యతలను ప్రభుత్వం సచివాల ఉద్యోగులకు అప్పగించింది. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంతో మరలా అంగన్వాడీ కార్యకర్తలు తమ విధుల్లో చేరారు. అయితే కేంద్రాల నిర్వహణ సచివాలయం ఉద్యోగులకు అప్పగించడంతో వారు అంగన్వాడీ కార్యకర్తలకు సకాలంలో కేంద్రాలను తెరచి కార్యకర్తలకు అప్పగించక పోవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్రాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు పడిగాపులు కాశారు. మండలం నారయణపురం, మున్సిపాలిటీ పరిధిలో నర్సిపురం, జయ రామచంద్ర పురం, మొగిలిపాడు, కోసంగిపురం, అంబుసోలి, సాయిబుల కాలనీ, కౌసల్య నగర్‌, పొందర వీధి, లేబర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో అదిగో తాళాలు ఇచ్చేస్తాను ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ కాలయాపన చేయడంతో కేంద్రాలకు వచ్చిన చిన్నారులకు పౌష్టికాహారానికి దూరమయ్యారు. దీంతో కార్యకర్తలు ఇదే విషయాన్ని ఐసిడిఎస్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సచివాలయం ఉద్యోగులు అంగన్వాడీ కేంద్రాలను తెరచి కార్యకర్తలకు అప్పగించారు.

 

➡️