అక్కుపల్లిలో గుడ్‌ మార్నింగ్‌

అక్కుపల్లిలో గుడ్‌ మార్నింగ్‌

గ్రామస్తులతో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

వైసిపి విజయానికి గ్రామస్థాయి నుంచి సమిష్టిగా కృషి చేయాలని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సూచించారు. అక్కుపల్లిలో గుడ్‌ మార్నింగ్‌ అక్కుపల్లి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ మేరకు పంచాయతీ పరిధిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. అందరికీ అన్నీ ఇచ్చిన వైసిపి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరు కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పాలిన శ్రీనివాస్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ దువ్వాడ మధుకేశవరావు, ఎంపిటిసి మాజీ సభ్యులు బర్రి భూపతి, వెంపళ్ల యోగి, కోడ సోమేశ్వరరావు, కర్రి తిరుపతిరావు పాల్గొన్నారు.

 

 

➡️