ఆర్‌బికెల ద్వారా విస్తృత సేవలు

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా అద్భుతమైన సేవలు అందిస్తుందని

ప్రారంభిస్తున స్పీకర్‌ సీతారాం

శాసనసభ స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- బూర్జ

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా అద్భుతమైన సేవలు అందిస్తుందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జలో రూ.21.80 లక్షల నిధులతో పనులు పూర్తి చేసిన రైతు భరోసా కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగుకు పూర్తిస్థాయిలో చేయూత అందిస్తున్న ఘనత సిఎం జగన్‌ నేతృత్వంలో వైసిపి సర్కార్‌కు దక్కుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పి పంట సాగుకు ఆర్థికసాయం అందిస్తూ… రైతులకు అన్ని విధాల చైతన్యపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ, విద్య పూర్తి చేసుకున్న విద్యవంతులను రైతులకు పూర్తిసాయం అందించేందుకు ఉద్యోగులుగా నియమించిందన్నారు. వీరి ద్వారా పంట ప్రారంభం నుంచి ఫలం చేతికొచ్చినంత వరకు రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారన్నారు. సబ్సిడీతో కూడిన ఎరువులు పంపిణీ నుంచి రైతులు పండించే పంటలకు మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలను కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో అల్లిన సర్పంచ్‌ జడ్డు మహేశ్వరరావు, జెడ్‌పిటిసి బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, టిట్కో రాష్ట్ర డైరెక్టర్‌ ఖండాపు గోవిందరావు, వైస్‌ ఎంపిపి బుడుమూరు సూర్యారావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ జల్లు బలరాం నాయుడు పాల్గొన్నారు. ఇంటింటికీ తాగునీరుమండలంలోని అల్లెన పంచాయతీ కిలంతరలో రూ.1.13 కోట్ల నిధులతో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయిలను ప్రారంభించారు. అలాగే అల్లినలో గడపగడపకు మన ప్రభుత్వం నిధులు రూ.20 లక్షలతో పనులు పూర్తి చేసిన సిసి రోడ్లను ప్రారంభించారు. అలాగే జగనన్న లేవుట్‌లో నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించారు. స్థానిక సర్పంచ్‌ జడ్డు మహేష్‌, గిరడ రమణ, గిరడ పట్టాభి మజ్జి రామారావు వండాన జనార్థనరావు పాల్గొన్నారు.

 

➡️