ఇద్దరూ.. ఇద్దరే

టెక్కలి నియోజకవర్గంలో మూలపేట పోర్టు ప్రధాన సమస్యగా ఉంది. పోర్టును

సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులో శిథిలావస్థకు చేరిన తుపాను షెల్టర్‌ భవనం

అసమస్యలపై పోరాడని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌

మారని టెక్కలి నియోజకవర్గ రూపురేఖలు

మరోసారి ఓట్ల కోసం పర్యటనలు

ఆ నియోజకవర్గానికి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఒకరేమో నాలుగున్నర ఏళ్లుగా ఎమ్మెల్సీ పదవిని వెలగబెట్టారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మరొకరు ఎమ్మెల్సీగా అదే ప్రాంతం నుంచి శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందాలి. ప్రజా సమస్యలు ఎన్నో పరిష్కారం కావాలి. నియోజకవర్గం అభివృద్ధి చూస్తే మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రజా సమస్యలూ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ పాటికే నియోజకవర్గమేదో ఈ పాటికే తెలిసి ఉంటుంది. అదే టెక్కలి నియోజకవర్గం. ఆ వారెవరో కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి ఓట్లు అడిగేందుకు గ్రామల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిస్థితిపై కథనం.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

టెక్కలి నియోజకవర్గంలో మూలపేట పోర్టు ప్రధాన సమస్యగా ఉంది. పోర్టును నిర్మించే క్రమంలో ప్రభుత్వం అనేక అడ్డదారులు తొక్కింది. సంతబొమ్మాళి మండలం మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. రైతులు వ్యతిరేకిస్తున్నా బలవంతంగా భూములను తీసుకుంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కోసం ఇళ్లు, పశువుల శాలలు తదితర స్ట్రక్చర్ల విలువ కోసం పోలీసు బలగాలను పెట్టి బలవంతంగా చేయించారు. పోర్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిపై బైండోవర్‌ కేసులు సైతం నమోదు చేశారు. పోర్టుకు భూములివ్వని వారి పంటలను బుల్డోజర్లతో తొక్కించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం తీవ్ర దమనకాండను ప్రదర్శించింది. పోర్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పోర్టు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ సరఫరా కాంట్రాక్టు పనులను చేజిక్కించుకుని సొంత లాభం చూసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా తమకు అండగా ఉంటారని ప్రజలు ఓటేసి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుని గెలిపిస్తే ఆయన పరిస్థితీ అందుకు భిన్నంగా ఏమీ లేదు. నియోజకవర్గ ప్రజల ఏనాడూ అటు వైపు కన్నెత్తి చూడలేదు. కోటబొమ్మాళిలోని క్యాంప్‌ కార్యాలయాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అమరావతి, విశాఖ వంటి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ కాలం గడిపిన అచ్చెన్నాయుడు, ఎన్నికలు రావడంతో ఇప్పుడు గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టారు. అసంపూర్ణంగానే ఆఫ్‌షోర్‌ఆఫ్‌షోర్‌ పూర్తికి టిడిపి, వైసిపికి ఐదేళ్లూ సరిపోలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.123.25 కోట్ల నుంచి రూ.466.28 కోట్లకు పెంచి హదరాబాద్‌కు చెందిన ఎస్‌విఇసి-ఇందు సంస్థకు అప్పగించింది. రిజర్వాయరు 2019 జూలై నాటికి పూర్తి కావాల్సి ఉంది. 2019లో టిడిపి అధికారం కోల్పోయే నాటికి 38 శాతం పనులే పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.4668.28 కోట్ల నుంచి రూ.852.25 కోట్లకు పెంచింది. ఇప్పటివరకు పనులు 45 శాతమే జరిగాయి. రిజర్వాయరు పూర్తయితే టెక్కలి, నందిగాం మండలాలకు తాగు, నీరు లభించేది.కనీస సౌకర్యాలూ కల్పించలేని దుస్థితినియోజకవర్గంలో గ్రామాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయారు. సంతబొమ్మాళి మండలం మేఘవరం, మరువాడ నుంచి బోరుభద్ర రహదారి పూర్తిగా పాడయ్యాయి. అదే మండలం గెద్దలపాడు, డి.మరువాడ, జగన్నాథపురం, సున్నాపల్లి, సూరాడవానిపేట తదితర ప్రాంతాల్లో నిర్మించిన తుపాను షెల్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. అదేవిధంగా వలలు భద్రపరుచుకునేందుకు నిర్మించిన షోర్‌ షెడ్లు కూడా పూర్తిగా పాడయ్యాయి. నందిగాం మండలంలో నందిగాం నుంచి సైలాడ వరకు ఉన్న పది కిలోమీటర్ల రోడ్డును సుమారు పదేళ్లు కిందట నిర్మించారు. గుంతలదారిలోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కోటబొమ్మాళి మండలం జాతీయ రహదరి-16 నుంచి కన్నెవలస, కురుడు నుంచి ఎరకపేట, హరిశ్చంద్రపురం నుంచి నిమ్మాడ రోడ్లు దారుణంగా ఉన్నాయి. టెక్కలిలో ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాస్పత్రిలో వైద్య సిబ్బంది లేక రిఫరల్‌ ఆస్పత్రిగా మారింది.సాగునీటి సమస్యల పరిష్కారంలో వైఫల్యంనియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు వంశధార ఎడమ కాలువయే ప్రధాన నీటి వనరుగా ఉంది. వంశధార కాలువ గట్లు బలహీనంగా ఉండటంతో శివారు భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. కాలువలను ఆధునికీకరణ చేస్తామని చెప్పిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆ మాట నిలబెట్టుకోలేదు. 2023 ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో చిన్నసాన ఎత్తిపోతల పధకానికి విద్యుత్‌ సరఫరా ఆపేయాలని ఆపేయాలని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఇచ్చిన ఆదేశాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఈ విషయంలో తమకు అండగా నిలబడలేదన్న ఆవేదన రైతుల్లో నెలకొంది.

 

➡️