మాట్లాడుతున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
సాధారణ ఎన్నికలు-2024లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను నామినేషన్ వేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, ఎస్‌ఎస్‌టి, ఎఫ్‌ఎస్‌టి, వీడియో సర్వేలెన్స్, అకౌంటింగ్ టీం సభ్యులకు గురువారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఎస్‌టి, విఎస్‌టి, ఎస్‌ఎస్‌సి అకౌంటింగ్ టీం సభ్యులు సమన్వయంతో, సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించాలని అన్నారు. అకౌంటింగ్ టీం సభ్యులు వివరాలను షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్లు నమోదు చేయాలన్నారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించిన పార్టీ ప్రచార ఖర్చులు నిర్వహించిన రేట్ల ప్రకారం నమోదు చేయాలన్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు ముద్రించినట్లు, ప్రింటర్ ప్రచురణకర్తలు ఎన్నికల ప్రాతినిధ్య చట్టం 127 ఏ ప్రకారం నిబంధనలు పాటించాలని అన్నారు. ఎంసిఎంసి ద్వారా ఎన్నికల్లో ప్రకటనలు జిల్లా మీడియా, అండ్ మానిటరింగ్ కమిటీ సర్టిఫికే షన్ చేయనున్నట్లు ఎన్నికల సంఘం విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయం నమోదు చేయాలని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా డబ్బు, మద్యం పంపిణీ ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎస్‌ఎస్‌టి తనిఖీలు పకడ్బందీగా నిర్వహించా లన్నారు. బ్యాంకు లావాదేవీలు రూ.10 లక్షలు మించి నగదు, జమ, ఉపసంహరణ, ఆన్‌లైన్ ద్వారా మల్టిపుల్ లావాదేవీలపై పర్యవేక్షణ చే యాలని సూచించారు. అన్ని టీమ్‌లు అప్రమ త్తతతో పని చేయాలన్నారు. సి-విజిల్ యాప ్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, సిపిఒ పి ఎస్‌ఎస్ ప్రసన్నలక్ష్మి, ట్రైనర్లు కిరణ్, ఎన్. బా లాజీ, మెప్మా పీడీ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.