ఓటు… మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది

ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉంది. మీ ఓటు మీ

పోలాకి : ర్యాలీ నిర్వహిస్తున్న సంఘాల మహిళలు

ప్రజాశక్తి- పోలాకి

ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉంది. మీ ఓటు మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని ఎపిఎం జి.రాజారావు అన్నారు. గురువారం మబగాంలో స్వయంశక్తి సంఘాల మహిళలతో ఓటుహక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ప్రతిజ్జ చేయించారు. ఓటుహక్కును ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిసి శాంతి కుమారి, విఒఎలు పాల్గొన్నారు.కొత్తూరు: అర్హులైన ప్రతిఒక్కరు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటును వినియోగించుకోవాలని మండలి మహిళా సమైక్య వెలుగు ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు కర్లెమ్మ గ్రామ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎపిఎం జనార్దన, మహిళ సమైక్య అధ్యక్షురాలు జి.సుధీష్ణ, పాలశెట్టి సింహద్రి, సిసి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.సోంపేట: మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఓటుహక్కుపై అవగాహన ర్యాలీ, మానవ హరం చేపట్టారు. మండలంలోని మత్స్యకార గ్రామాల్లో ఓటుహక్కు నీ భవిష్యత్‌కు మార్గం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎపిఎం రవణమ్మ, సిసిలు రాణి, ధనలక్ష్మి, తేజ పాల్గొన్నారు.

 

➡️