చంద్రబాబుతోనే భవిష్యత్‌కు గ్యారంటీ

చంద్రబాబుతోనే భవిష్యత్‌కు గ్యారంటీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఆదివారం పట్టణంలో

నరసన్నపేట : బాబు ష్యూరిటీ పోస్టర్లను ప్రజలకు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే

ప్రజాశక్తి- నరసన్నపేట

చంద్రబాబుతోనే భవిష్యత్‌కు గ్యారంటీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఆదివారం పట్టణంలో 7వ వార్డు కలివరపువీధిలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టిడిపి, జనసేన ఉమ్మడి పార్టీలు ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శిమ్మ చంద్రశేఖర్‌, మాజీ సర్పంచ్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి గొద్దు చిట్టిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు, మాజీ ఎంపిటిసి జామి వెంకటరావు, మాజీ వార్డు సభ్యులు, వారణాసి మురళీ, రాష్ట్ర ఎస్‌సి సెల్‌ సెక్రటరీ బేవార రాము పాల్గొన్నారు.కోటబొమ్మాళి: రాష్ట్రానికి అభివృద్ది, ప్రజలకు సంక్షేమం, నిరుద్యోగులకు ఉద్యోగం కావాలంటే వస్తున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి పోయి చంద్రబాబు సిఎం కావాలని మాజీ సర్పంచ్‌, మాజీ నీటిసంఘం అధ్యక్షుడు ఉప్పాడ జయరాం అన్నారు. మండలం చిన్న హరిశ్చంద్రపురంలో ఆదివారం టిడిపి నాయకులతో కలిసి భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అందించబోయే పథకాల పోస్టర్లను అందజేశారు.

 

➡️