జగనన్న గృహాలతో ఊర్లు వెలిశాయి

జగనన్న గృహ నిర్మాణ పథకం ద్వారా పెద్ద ఎత్తున చేపట్టిన ఇళ్లు నిర్మాణాలతో ఊర్లు వెలిశాయని

శిలాఫకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ సీతారాం

శాసనసభ స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి పొందూరు

జగనన్న గృహ నిర్మాణ పథకం ద్వారా పెద్ద ఎత్తున చేపట్టిన ఇళ్లు నిర్మాణాలతో ఊర్లు వెలిశాయని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలంలోని నందివాడ, పొందూరు, ధర్మపురం, తోలాపి గ్రామాల్లో జగనన్న గృహ నిర్మాణ పథకంలో చేపట్టిన ఇళ్లను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవానికీ సొంతింటి కళను సాకారం చేయాలనేది ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆశయమని పేర్కొన్నారు. జగనన్న కాలనీలకు పూర్తిస్థాయిలో విద్యుత్‌, తాగునీరు, రహదారి సదుపాయాలను కల్పించామని అన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, ఎంపిపి ప్రతినిది కిల్లి నాగేశ్వరరావు, వైసిపి మండల అధ్యక్షుడు పప్పల రమేష్‌కుమార్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, పార్టీ మండల జెసిఎస్‌ బాడాన వెంకటకృష్ణారావు, వైసిపి వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు ప్రతాప్‌కుమార్‌, ఉప సర్పంచ్‌ గోవిందరావు పాల్గొన్నారు.

 

➡️