టిడిపి పూర్వ వైభవానికి కృషి

టిడిపి విజయానికి టిడిపి మండల క్లస్టర్లు, యూనిట్‌ బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్‌

టిడిపి విజయానికి టిడిపి మండల క్లస్టర్లు, యూనిట్‌ బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి సూచించారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం రాగోలు అసిరితల్లి కళ్యాణ మండపంలో మండలం క్లస్టర్ల, యూనిట్‌ బూత్‌ లెవెల్‌ ఏజెంట్లకు సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షులు నారాయణ చంద్రబాబునాయుడు భవిష్యత్‌ ప్రణాళికకు సంబంధించిన అంశాలను ఇంటింటికీ తీసుకెళ్లి పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలన్నారు. అర్హులైన ఓటర్లు అందరూ ఓట్ల జాబితాలో ఉండేలా చూడాలన్నారు. కుటుంబ సాధికార సారథులు, యాప్‌ ఎన్రోల్మెంట్‌, ఓటర్‌ వెరిఫికేషన్‌ పొలిటికల్‌ అండ్‌ టెక్నికల్‌ కెఎస్‌ఎస్‌ నియామకం, మన టిడిపి యాప్‌ తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ద్వారా తెలియజేయాలని నియోజకవర్గ పరిశీలకులను కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు శీర రమణయ్య, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు చిట్టి మోహన్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి బలగ చెంగాలరావు, నియోజకవర్గ బిసి అధ్యక్షులు గేదెల శ్యామ్‌ పాల్గొన్నారు.

 

➡️