‘టెక్నివర్స్‌’ వెబ్‌సైట్‌ ప్రారంభం

స్థానిక ఆర్‌జియుకెటిలో ఏప్రిల్‌ 13, 14 తేదీల్లో

ప్రారంభిస్తున్న విజయకుమార్‌

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

స్థానిక ఆర్‌జియుకెటిలో ఏప్రిల్‌ 13, 14 తేదీల్లో జరగబోయే టెక్నికల్‌ ఫెస్ట్‌ టెక్నివర్స్‌కు సంబంధించి వెబ్‌సైట్‌ షషష.్‌వషష్ట్రఅఱఙవతీరవ.తీస్త్రబస్‌రసశ్రీఎ.aష.ఱఅను యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఫ్రొఫెసర్‌ యం.విజరు కుమార్‌ ఆన్‌లైన్‌ వేదికగా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్నికల్‌ ఫెస్ట్‌లో భాగస్వాములై పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలను పొందాలని విద్యార్థులకు సూచించారు. క్యాంపస్‌ డైరెక్టర్‌ కె.వి.జి.డి. బాలాజీ, ఒఎస్‌డి సుధాకర్‌బాబు, ఎఒ ముని రామకృష్ణ, డీన్‌ కొర్ల మోహన్‌కృష్ణ చౌదరి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అసిరినాయుడు, డీన్‌ వెల్ఫేర్‌ గేదెల రవి, టెక్నికల్‌ ఫెస్ట్‌ కన్వీనర్‌ సి.ఎచ్‌.వాసు, కో- కన్వీనర్‌ కె.దిలీప్‌ కుమార్‌, డిప్యూటీ ఎఒ విశ్వనాథ్‌ బిసై పాల్గొన్నారు.

 

➡️