మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళలకు అండగా నిలుస్తూ, వారిని ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు

నమూనా చెక్కును అందజేస్తున్న విద్యాసాగర్‌, సూరిబాబు

డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మహిళలకు అండగా నిలుస్తూ, వారిని ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిఆర్‌డి పీడీ డాక్టర్‌ విద్యాసాగర్‌ అన్నారు. కార్యక్రమంలో వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పంపిన సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ఈ వైఎస్‌ఆర్‌ ఆసరా 4విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసిని కాడ నుంచి ప్రారంభించారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యాన విద్యాసాగర్‌, కళింగ వైశ్య, తూర్పు కాపు, పొందరకాపు కార్పొరేషన్ల చైర్మన్లు నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగో విడత కింద రూ. 332.46 కోట్లను 1,77,314 మంది మహిళల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. మహిళలకు ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయడం వల్ల సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, కంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు మూల కృష్ణవేణి, డిసిఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ దుంపల రమణ, పొందర కార్పొరేషన్‌ రాజాపు హైమావతి, జిల్లా పౌర సంబంధాల అధికారి కె.బాలమాన్‌ సింగ్‌ పాల్గొన్నారు.

 

➡️