రహదారి గోతులమయం

మండలంలోని పురుషోత్తపురం వెళ్లే రహదారి గోతుల మయంగా మారి ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. పాలకులు, అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను

గోతులమయమైన పురుషోత్తపురం- రామచంద్రపురం రోడ్డు

ఇక్కట్లు పడుతున్న ప్రజలు

చోద్యం చూస్తున్న పాలకులు

ప్రజాశక్తి- ఆమదాలవలస

మండలంలోని పురుషోత్తపురం వెళ్లే రహదారి గోతుల మయంగా మారి ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. పాలకులు, అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని ప్రభుత్వం పలుమార్లు చెబుతునే ఉంది. కానీ, మాటలకే పరిమితం అయ్యిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు కిలోమీటర్లు రహదారి అత్యంత దారుణ పరిస్థితిలో ఉందని, తరచూ ప్రమాదాలూ జరుగుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చెవ్వాకులపేట వద్ద ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి రోజూ వందల కొద్దీ లారీలు ఇసుకను తరలిస్తుండడంతో రహదారి గోతుల మయంగా మారిపోయింది. రోడ్డులో గజానికో గుంతగా మారి రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే బయపడుతున్నారని, రాళ్లు తేలిన రహదారిపై రోజూ ప్రయాణిస్తుంటే సైకిళ్లు మరమ్మతులకు గురై సకాలంలో పాఠశాలలకు చేరుకోలేకపోతున్నామని వాపోతున్నారు. పొన్నాంపేట, పొన్నాంపేట కాలనీ, రామచంద్రాపురం, చిట్టీవలస, చెవ్వాకులపేట, అలమాజీపేట తదితర 8 గ్రామాల ప్రజలు రహదారి లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. గతేడాది రోడ్లు, భవనాల శాఖ అధికారులు రహదారికి ప్యాచ్‌ వర్క్‌లు చేసి మమ అనిపించేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మించి ఎనిమిదేళ్లు కావస్తుందని, కానీ, నేటికీ శాశ్వత రహదారికి నోచుకోలేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ప్రజలు పడుతున్న కష్టాలను గ్రహించి నూతన రహదారిని నిర్మించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.

 

➡️