సమిష్టి పోరాటం వల్లే విజయం

రాష్ట్రవ్యాప్తంగా 42 రోజులపాటు ఎన్నోవ్యయ

శ్రీకాకుళం అర్బన్‌ : ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రవ్యాప్తంగా 42 రోజులపాటు ఎన్నోవ్యయ ప్రయాసలకోర్చి ఎన్నో నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా సమిష్టిగా పోరాడడం వల్లే విజయం సాధ్యమైందని, అంగన్వాడీ సమ్మె విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కరణం కళ్యాణి అన్నారు. నగరంలోని గుజరాతీపేటలో ఉన్న అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీల విజయోత్సవ సభ బుధవారం నిర్వహించారు. ఈ సభలో వారు హాజరై మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించినట్టు తెలిపారు. సమస్యల పరిష్కరానికి స్పష్టమైన హామీ లభించిందన్నారు. సమ్మెను విరమించి యథావిథిగా విధుల్లోకి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు చేరారన్నారు. సమ్మెలో పాల్గొని మద్దతు తెలియజేసిన లబ్ధిదారులకు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు గుజరాతీపేట పుర వీధుల్లో విజయోత్సవన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డి.జ్యోతి, ముత్యాలమ్మ, కె.పార్వతి, లక్ష్మి, సూర్యకుమారి, లీలాకుమారి, అంజలిభారు, మల్లేశ్వరి పాల్గొన్నారు. కోటబొమ్మాళి: తమ హక్కులు డిమాండ్ల సాధన కొరకు పోరాడినప్పుడే సాధ్యమవుతాయని సిఐటియు నాయుకులు హనుమంతు ఈశ్వర రావు, దుంపల సుదర్శన, సామ సంజీవరావు, జి.వి.రమణలు అన్నారు. స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

 

 

➡️