సమీకృత కలెక్టరేట్‌ పనులు వేగవంతం

సమీకృత కలెక్టర్‌ కార్యాలయ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ మజనీర్‌ జిలానీ

వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌సమీకృత కలెక్టర్‌ కార్యాలయ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ మజనీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయాన్ని జెసి ఎం.నవీన్‌, రోడ్లు, భవనాలశాఖ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి 17న పర్యటనలో నాటి పనుల్లో పురోగతి, నిర్ధేశించిన పనులపై ఆరాతీశారు. నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ జాన్‌ సుధాకర్‌, ఇఇ రవినాయక్‌, డిఇఇ ఎం.ఎల్‌.వి.సాగర్‌, ఎఇఇ పి.టి.రాజు, కాంట్రాక్టర్‌ ప్రసాద్‌ ఉన్నారు.

 

➡️