స్త్రీ, పురుషులు సమానమే

సమాజంలో పురుషులు, మహిళలు అంతా

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సమాజంలో పురుషులు, మహిళలు అంతా సమానమేనని, అవకాశాలు అందిపుచ్చుకొని మహిళలు మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా ఆకాంక్షించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బార్‌ అసోసియేషన్‌ భవనంలో జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, న్యాయశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ఎన్ని సూర్యారావు అధ్యక్షతన గురువారం మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలు ఎవరిపైనా ఆధార పడకుండా స్వశక్తితో రాణించి సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని చెప్పారు. జూనియర్‌ మహిళా న్యాయవాదులూ వృత్తిలో క్రమశిక్షణతో సాధించి ఉన్నతంగా ఎదగాలన్నారు. సూర్యారావు మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు ఎంతో గొప్ప గౌరవం ఉందన్నారు. ప్రకృతి వనరులకు సైతం స్త్రీ మూర్తులతో పోలుస్తూ గౌరవిస్తుండడం భారతీయ సంస్కృతిలో భాగమైందన్నారు. మహిళా న్యాయవాది గరిమెళ్ల వెంకట సూర్య ఉమా విశాలాక్షిని దుశ్శాలువతో ఘనంగా సన్మానించి మెమోంటోతో సత్కరించారు. కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, 4వ అదనపు జిల్లా జడ్జి మహేంద్ర ఫణికుమార్‌, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.అనురాద, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శారదాంబ, ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కె.రాణి, 3వ అదనపు మెజిస్ట్రేట్‌ డి.శ్రీభరణి, ఆమదాలవలస బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చాపర విజయలక్ష్మీబాయి, బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పొన్నాడ రాము, సీనియర్‌ న్యాయవాదులు జి.లక్ష్మి, శిష్టు రమేష్‌, చమళ్ల నర్సింహమూర్తి, సరళాకుమారి, మహిళా ప్రతినిధి వేమూరి హరిప్రియ పాల్గొన్నారు.

 

➡️