హామీలన్నీ నెరవేర్చా

2019 ఎమ్మెల్యే ఎన్నికల ముందు పలాస నియోజకవర్గంలో

మాట్లాడుతున్న అప్పలరాజు

పశు సంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- పలాస

2019 ఎమ్మెల్యే ఎన్నికల ముందు పలాస నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చానని పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు కళ్యాణ మండపంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తాను కాశీబుగ్గలో రైతుబజార్‌ నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీను నేరవేర్చాలేక పోతానని పేర్కొన్నారు. అందుకు కారణం ఆ స్థలం న్యాయపరమైన వివాదంలో ఉండడంతో నిర్మాణం చేపట్టలేకపోయామని చెప్పారు. గత పాలకలు రైల్వే ప్లైఓవరు పనులు విడిచిపెడితే… ఎమ్మెల్యేగా గెెలుపొందిన తరువాత పనులు చేపట్టానని అన్నారు. 14 ఏళ్లుగా ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు పనులు నత్తనడకన సాగుతుంటే… వైసిపి ప్రభుత్వంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. జీడి రైతులకు వైసిపి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి సారీ ప్రతిపక్ష నాయకులు రైతులకు సాగునీరు అందించలేదని ఆరోపణలు చేసేందుకు సిగ్గుపడాల న్నారు. అందుకు టిడిపి నాయకులు టెక్కలి నియోజకవర్గంలో అనుమతులు లేని లిఫ్ట్‌ ఇరిగేషన్లు నిర్మాణం చేపట్టడంతో పలాస నియోజకవర్గంలో శివారు భూములకు వంశధార నీరు అందలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కిడ్నీ రోగులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రూ.50 కోట్లతో 200 పడకల ఆస్పత్రితో పాటు కిడ్నీ పరిశోధన కేంద్రం, ప్రతి ఇంటికీ శుద్ధ జలం అందించాలనే ఉద్దేశంతో రూ.700 కోట్లతో తాగునీటి పథకానికి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశామన్నారు. పలాస డివిజన్‌ కేంద్రంతో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని అన్నారు. పలాస నియోజకవర్గం లో 380 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అందుకు సంబంధించి భూసేకరణ చేపట్టామన్నారు. గౌతు కుటుంబం ప్రజలను అణచివేస్తారని, ఇది టిడిపి సర్వేలో తేలడం వల్లే గౌతు శిరీషకు టిక్కెట్‌ కేటాయింపులో ఆలస్యమైదని వాఖ్యానించారు.

 

➡️