పాఠశాల సముదాయం సమావేశంలో మాట్లాడుతున్న డిఇఒ తిరుమల చైతన్య
- జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య
ప్రజాశక్తి – పొందూరు
ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 149 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.తిరుమల చైతన్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల సముదాయాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పరీక్షలకు 28,984 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. వేసవి పరిస్థితుల దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో హాల్‌టిక్కెట్లుఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వారి హాల్ టిక్కెట్ల అధ్యయన కేంద్రాల్లో, ఓపెన్ స్కూల్ వెబ్‌సైట్ (షషష.aజూశీజూవఅరషష్ట్రశీశీశ్రీ.శీతీస్త్ర)లో తీసుకోవాలని తెలిపారు. ఫొటో పడని హాల్ టిక్కెట్స్ పరీక్ష ప్రవేశానికి అనర్హులని స్పష్టం చేశారు. అటువంటి విద్యార్థులు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. సందేహాల నివృత్తికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8328269673, 9505678655 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 807 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు.