15 వేల మెజార్టీ ఖాయం

15 వేల మెజార్టీ ఖాయం

మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్‌

* వైసిపి టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌

ప్రజాశక్తి – కోటబొమ్మాళి

టెక్కలి నియోజకవర్గంలో వైసిపి 15 వేల మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. స్థానిక ఒక విద్యాసంస్థ ఆవరణలో బుధవారం నిర్వహించిన వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారు ఎండను కూడా లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఈసారి టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను, పార్లమెంట్‌ సభ్యునిగా పేరాడ తిలక్‌ అధిక మెజార్టీతో గెలుస్తామన్న నమ్మకం కలిగిందన్నారు. సమావేశంలో ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, వైసిపి మండల అధ్యక్షులు నూక సత్యరాజు, వైస్‌ ఎంపిపిలు దుక్క రోజారామకృష్ణ, బోయిన నాగేశ్వరరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బాడాన మురళి, వైసిపి నాయకులు అన్నెపు రామారావు, బొడ్డు అప్పన్న, గడ్డవలస నాగభూషణరావు, సంపతిరావు హేమసుందరరాజు, పేడాడ వెంకటరావు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

➡️