18న జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సు

ఈనెల 18వ తేదీన శ్రీకాకుళంలో

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

  • సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఈనెల 18వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించే జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, జిల్లా కమిటీ సభ్యులు కె.నాగమణి పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో సదస్సు ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా, జిల్లాలో వంశధార, నాగావళి వంటి నదులు, సువిశాల సాగుభూమి, సుదీర్ఘ సముద్రతీరం, అటవీ సంపద ఉన్నా జిల్లా వెనుకబాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సమగ్రాభివృద్ధిపై నిర్వహిస్తున్న సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, పూర్వ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ, గ్రేటర్‌ విశాఖ సిపిఎం కార్పొరేటర్‌ బి.గంగారావు, ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీరు ఉప్పలపాటి నారాయణరావు, అనేకమంది ప్రముఖులు, మేధావులు ముసాయిదా పత్రాలను ప్రజెంట్‌ చేస్తా రని చెప్పారు. వీటిపై చర్చించి సమగ్రాభివృద్ధికి సూచనలు తయారు చేయనున్నట్లు తెలిపారు.

➡️