21న చెకుముకి సైన్స్‌ సంబరాలు

జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈనెల 21న చెకుముకి సైన్స్‌ సంబరాలను నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొంటి గిరిధర్‌, కుప్పిలి కామేశ్వరరావు తెలిపారు. నగరంలోని

సమావేశంలో మాట్లాడుతున్న గిరిధర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈనెల 21న చెకుముకి సైన్స్‌ సంబరాలను నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొంటి గిరిధర్‌, కుప్పిలి కామేశ్వరరావు తెలిపారు. నగరంలోని జెవివి కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో చెకుముకి హైస్కూల్‌ స్థాయి సైన్స్‌ సంబరాలు 380 పాఠశాలల్లో నిర్వహించగా, 22 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. రెండో స్థాయిలో మండలస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలను 21న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంబరాల్లో 380 టీమ్‌లు, 1140 మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. మూడో స్థాయి జిల్లాస్థాయి చెకుముకి సైన్సు సంబరాలను జనవరి 7న శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నట్ల తెలిపారు. ఇందులో 77 టీమ్‌లు, 231 మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. నాలుగో స్థాయిలో రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలను ఫిబ్రవరి 10, 12 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెకుముకి సైన్స్‌ సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జెవివి జిల్లా ఉపాధ్యక్షులు కుర్మారావు, చెకుముకి జిల్లా కన్వీనర్‌ ఎస్‌.సాయి శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

➡️