3న పల్స్‌పోలియో

మార్చి 3న అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం తప్పని సరని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

శ్రీకాకుళం అర్బన్‌ :

మార్చి 3న అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం తప్పని సరని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4,5 తేదీల్లో మాపప్‌ రౌండు ఉంటుందన్నారు. జిల్లాలో 1,79,984 మంది ఐదేళ్లలోపు వయసు గల పిల్లలు ఉన్నారని, వారి కోసం 1232 పోలియో బూత్‌లు, 50 ట్రాన్సిట్‌ బూతులు ఏర్పాటు చేశామన్నారు. 78 మొబైల్‌ టీములు, 121 సూపర్‌వైజర్‌ బృందాలుగా ఏర్పడి 3,12,000 డోసులు వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మొబైల్‌ టీములు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అన్ని సంచార జాతుల వారి పిల్లలకు, ఇటుక బట్టీలు నిర్వహించే వారి పిల్లలకు, నిర్మాణ స్థలాలు, మత్స్యకార గ్రామాల్లో వంద శాతం లక్ష్యంగా విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బి.మీనాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి ఈశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డిఆర్‌డిఎ పీడీ డాక్టర్‌ విద్యాసాగర్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, రవాణా, విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.వికలాంగులకు ట్యాబ్‌ల పంపిణీ వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యాన కళాశాల స్థాయిలో డిగ్రీ, పిజి చదువుతున్న వికలాంగులైన ఆరుగురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఒక్కరికి డైస్‌ ప్లేయర్‌ అందజేశారు. జెసి ఎం.నవీన్‌ మాట్లాడుతూ ల్యాప్‌టాప్‌లు అవసముంటే వికలాంగుల శాఖ ఎడి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వికలాంగుల శాఖ ఎడి కవిత పాల్గొన్నారు.

➡️