- ఆన్‌లైన్ ద్వారా నిర్వహణ ఆరు
- పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
టెట్ పరీక్షను ఈనెల మూడో తేదీ నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)ను ఆరు పరీక్షా కేంద్రాల్లో రెండు పూటలూ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎచ్చెర్లలో శ్రీ వెంకటేశ్వర, శివానీ ఇంజినీరింగ్ కళాశాలలు, నరసన్నపేటలో గొట్టిపల్లి వద్ద కోర్ టెక్నాలజీ కళాశాల, బరంపురంలో అయాన్ డిజిటల్ జోన్ కాలికట్ కళాశాల, చాండీపథర్ ఎస్‌ఎంఐటి డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాల, బృందాబన్ బిహార్ అంకూష్‌పూర్ ఎస్‌ఎంఐటి కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్ నిరంతరాయంగా ఉండాలని స్పష్టం చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్షల సమయాలకు అనుగుణంగా అభ్యర్థులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్యారోగ్యశాఖ ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం 9703148269, 7989139860, 9494094904, 9177975250 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.