ప్రారంభిస్తున్న ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ సురేఖ
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం ఆధ్వర్యాన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో నిర్వహించిన జిల్లాస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలు ఆసక్తిగా సాగాయి. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సురేఖ మంగళవారం ప్రారంభించారు. రన్నింగ్, జావలిన్ త్రో, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, షాట్‌ఫుట్ వంటి ఈవెంట్‌ల్లో పలు విభాగాల వారీగా పోటీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 60 మంది పారా క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 31 మంది క్రీడాకారులను ఈనెల 30న గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయిలో రాణించిన క్రీడాకారులకు జాతీయ స్థాయి పోటీలకు అర్హత లభిస్తుందని కోచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పోటీలను స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ జిల్లా అధ్యక్షులు టి.రాము, కార్యదర్శి ఎన్.గిరిధర్, కోశాధికారి డి.అచ్యుతరావు, సభ్యులు ఎన్.స్రవంతి, ఖేలో ఇండియా కోచ్‌లు శ్రీనివాస్, ఎన్.రాజేష్ పర్యవేక్షించారు.