8న చంద్రబాబు రాక

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 8న పలాస వస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సభాస్థలిని పరిశీలిస్తున్న రవికుమార్‌, శిరీష

ప్రజాశక్తి- పలాస

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 8న పలాస వస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష తెలిపారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో హెలీప్యాడ్‌, గౌతు నివాసగృహం వద్ద బహిరంగ సభ ఏర్పాటుకు శనివారం స్థానిక నాయకులతో కలిసి స్థలాన్ని శనివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలాసలో నిర్వహించనున్న ప్రజా గళం కార్యక్రమానికి చంద్రబాబు హాజరు అవుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మహిళల సమస్యలు, వారి అభివృద్ధి వంటి అంశాలు, మహిళలతో ముఖాముఖి వంటి ఉంటాయన్నారు. కార్యక్రమంలో టిడిపి పలాస నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి, రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, బి.నాగరాజు, టిడిపి మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్‌కుమార్‌, డొక్కారి శంకర్‌, కొవ్వూరు సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం టిడిపి కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పర్యటను విజయవంతం చేయాలని కోరారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్న కార్యకర్తలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాబిన్‌శర్మ, టీమ్‌ అజెరు పాల్గొన్నారు.

 

➡️