ఘనంగా రంగోత్సవం

జిల్లా విద్యాశాఖ

ముగ్గులు వేసిన విద్యార్థులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జిల్లాస్థాయి రంగోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకలను జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 250 మంది విద్యార్థులు పలు పోటీల్లో పాల్గొన్నారు. ఎనిమిది విభాగాలుగా నిర్వహించిన పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. వ్యాసరచన, చేతిరాత, రంగోలీ, వక్తృత్వపు, ఫోక్‌ డాన్సులు, డిజిటల్‌ పోస్టర్స్‌, రోల్‌ ప్లే, స్లోగన్‌ ఇతర పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచన విజేతలకు రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి విజయకుమారి, ప్రిన్సిపాల్‌ ఎ.గౌరీశంకర్‌, అధ్యాపకులు భారతమ్మ, జి.వి రమణ, ఎ.వేణుగోపాల్‌, ఎల్‌.లీలా మోహన్‌, వై.వి.ఎ నాయుడు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

➡️