ఆమదాలవలస : ర్యాలీ నిర్వహిస్తున్న జడ్జి, సిబ్బంది
ప్రజాశక్తి- ఆమదాలవలస
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను తప్పనిసరిగా వినియోగించాలని జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్.మణి అన్నారు. గురువారం పట్టణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కణితి విజయలక్ష్మి భారు ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్టం విధి విధానాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వలన ప్రమాదాల బారిన పడి యువతీ, యువకులు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్‌ను బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని అందుకే హెల్మెట్‌ను ధరించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండి వాటిని పాటించాలన్నారు. న్యాయవాదులు, పోలీసు యంత్రాంగం, కోర్టు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ఉపయోగాన్ని తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం వచ్చేలా నినాదాలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సీపాన గోవిందరావు, న్యాయవాదులు పైడి వరహానరసింహం, ప్రభాకరరావు, రాజేశ్వరరావు, సత్యం పాల్గొన్నారు.పొందూరు: ద్విచక్ర వాహనదారులు రహదారి ప్రమాదాల నుంచి రక్షణకు హెల్మెట్‌ను వినియోగించాలని జూనియర్ సివిల్ జడ్జి బి.జ్యోత్స్న అన్నారు. పొందూరు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆధ్వర్యంలో హెల్మెట్ వినియో గంపై ‘వన్ కె వాక్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేడ్కర్ కూడలి నుంచి సిస్టమ్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఐ వెంకట రమణ, కోర్టు సూపరెంటెండెంట్ సత్యనారాయణ, న్యాయ వాదులు, జి.సిగడాం, పొందూరు పోలీస్ సిబ్బంది, విద్యార్ధులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.టెక్కలి రూరల్ : వాహనదారుడు, వెనుకున కూర్చున్న వారు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించి ప్రాణాలను కాపాడు కోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.హెచ్.తేజచక్రవర్తి అన్నారు. అంబేద్కర్ కూడలి నుంచి ఇందిరాగాంధీ కూడలి వరకు న్యాయవాదులతో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టెక్కలి మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ డి.సంజీవరావు, వి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పలాస: హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు నియంత్రించ వచ్చునని సివిల్ కోర్టు జడ్జి యు.మాధురి అన్నారు. కోర్టు ఆవరణ నుంచి జీడి పిక్క బొమ్మ వరకు బార్ అసోసియేషన్, సిబ్బంది హెల్మెట్ వినియోగంపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.విశ్వేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ జిఎంఎస్ అనిల్‌రాజు, తాండ్ర మురళి, కోత రజనికుమార్, కొమర దేవరాజు, రవికుమార్, జి.ప్రభాకర్, శ్యామ్, సూపరింటెండెంట్ కె.కృష్ణ, ఎఎస్‌ఐ సంజీవరావు విద్యా వాహిని ప్రిన్సిపాల్ తిరుమలరావు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం: హెల్మెంట్ వాడకం వల్ల ఉపయోగాలను వివరిస్తూ… సివిల్ జడ్జి పరేష్‌కుమార్ ఆధ్వర్యాన పట్టణంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రెసిడెంట్ ఎన్.రమణయ్యరెడ్డి, నాగరాజ్ పాత్రో, భగవాన్‌దాస్, ఎస్.లక్ష్మీనారాయణ, సూర్యనారా యణ జగ్గారావు, ప్రహల్లాదరెడ్డి, వేణు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, శాంతి నికేతిన్, ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. కోటబొమ్మాళి: ద్విచక్రవాహనం నడిపిన, వెనుక కూర్చోన్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి- ప్రాణాలు కాపాడు కోండని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు బి.ఎం.ఆర్.ప్రసన్నలత అన్నారు. ఈ మేరకు న్యాయవాదులో కోటబొమ్మాళి మెయిన్ రోడ్డులో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. న్యాయవాద సంఘ అధ్యక్షులు లకినేని శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు నారాయణ రావు, కార్యదర్శి తిరుమలరావు, పూజారి వాసుదేవరావు, డి.నరసింహమూర్తి, అప్పలనాయుడు, బి.ధర్మారావు, కె.మన్మథరావు, వై.వెంకటరావు, కె.వెంకటరావు పాల్గొన్నారు. సోంపేట: ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్ వినియో గించాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. కోర్టుల సముదాయం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు అవగాహనా ర్యాలీ చేపట్టారు. ఎస్‌ఐ హైమావతి, బార్ అధ్యక్షుడు ఎం. సర్వేశ్వరరావు, కోర్టు సిబ్బంది జోగారావు, ఎన్.ఎస్.విజరుకుమార్ పాల్గొన్నారు.కొత్తూరు : హెల్మెంట్ రక్షణ కవచమని జూనియర్ సివిల్ జడ్జి కె.రాణి అన్నారు. ఈ మేరకు కోర్టు ఆవరణ నుంచి కూర్మదాసుపురం, కొత్తూరు వీధుల్లో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు రాడ రాజు, ఆరుబోలు ధర్మారావు, పోలీసులు పాల్గొన్నారు.