విప్‌ కారు ఢకొీని వ్యక్తి మృతి

ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం

వివరాలు సేకరిస్తున్న రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌

ప్రజాశక్తి – ఇచ్ఛాపురం

ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కారు ఢకొీని మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన పాలెపు అంగధరావు (77) సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కొఠారిలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సాడి సహదేవరెడ్డి సోదరుడు జోగారావు కుమార్తె నిశ్చితార్థం కార్యక్రమానికి విప్‌ హాజరయ్యారు. తిరిగి ఆయన నివాసానికి వెళ్తుండగా కొఠారి గ్రామ బస్సు షెల్టర్‌ వద్దకు వచ్చేసరికి అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని, సరిగా కళ్లు కనిపించని అగంధరావు ఎమ్మెల్యే కారుకు ఎదురుగా రావడంతో ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన్ను విప్‌ తన సొంత వాహనంలో ఇచ్ఛాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అగంధరావు మృతి చెందాడు. అనాథ అయిన ఆయన కొఠారి బస్టాండ్‌ వద్ద ఉంటాడని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఇచ్ఛాపురం రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

➡️