ఫిర్యాదులను స్వీకరిస్తున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి
ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి
ప్రజాశక్తి – పలాస
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తున్నట్లు ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి తెలిపారు. కాశీబుగ్గ పొలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 12 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను స్వీకరించిన ఎస్‌పి వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించారు. సమస్యలపై పూర్తిస్థాయి విచారణ చేసి పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. ప్రజలు వారి సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకొస్తే చట్టపరిధిలో పూర్తి విచారణ చేసి త్వరితగతిన పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పలాస డివిజన్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రజలు వారి సమస్యలను విన్నవించేందుకు శ్రీకాకుళం రావడం కష్టమవుతుందన్న ఉద్శేంతో తానే ప్రతి శుక్రవారం పలాస వచ్చి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. తనకు అందిన ప్రతి ఫిర్యాదుపై విచారణ చేసి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.