రెప్పపాటులో తప్పిన ముప్పు

రెప్పపాటులో పెను

కారుపై పడిన చెట్టు

  • కారుపై కూలిన చెట్టు

ప్రజాశక్తి- కవిటి

రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. వెళ్తున్న కారుపై ఓ భారీ మోడువారిన చెట్టు ఉన్నపళంగా పడిపోవడంతో ఆ ప్రాంతం లో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. దీంతో కారు లో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… శనివారం మధ్యా హ్నం 3 గంటల సమయంలో నెలవంకకు చెందిన దుర్గాశి దిలీప్‌ తన కారులో గ్రామానికి చెందిన ఇంకో వ్యక్తితో కలిసి కవిటి వైపు వెళ్తున్నారు. కవిటి అశోక్‌ థియేటర్‌ వద్దకు వచ్చేసరికి రోడ్డు పక్కనే ఉన్న ఓ మోడు వారిన వృక్షం ఒక్కసారిగా వారి కారుపై పడింది. అనుకోని ఈ సంఘటనకు కారులో ఉన్న దిలీప్‌ ఒక్కసారి గా హడ లిపోయినా కారు ఎయిర్‌ బేగ్స్‌ తెరుచుకోవడంతో ఇద్దరూ చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. అయితే చెట్టు బలంగా కారుపై పడ డంతో కారుముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అను కోని ఈ సం ఘటనతో సమీపంలో ఉంటున్నవారు ఒక్కసారిగా భయబ్రాం తులకు గురయ్యారు. మోడు వారిన ఈ చెట్టు తొలగిం చాలని ఎన్ని సార్లు అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా ఏదైనా జరిగుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డు పక్క నే ఉన్న మోడువారిన వృక్షాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు.

➡️