పొందూరు : సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్
ప్రజాశక్తి- పొందూరు
పెండింగ్‌లో ఉన్న ఇంటి నిర్మాణాలను పూర్తి చేసిన ప్రతి లబ్దిదారునికి డబ్బులు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. పట్టణంలో మన ఇళ్లు ్ల- మన గౌరవం కార్యక్రమంలో భాగంగా శనివారం అధికారులు, లబ్దిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని, అందులో గృహ నిర్మాణశాఖ ఒకటన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు దూరంగా ఉన్న కొండ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మాణానికి లే అవుట్లు వేశారని, అక్కడ రోడ్లు, కాలువలు, విద్యుత్‌తో పాటు తాగునీరు వంటి మౌలిక వసతులను కల్పించకపోవడంతో ఇళ్లు నిర్మాణానికి లబ్దిదారులు ముందుకు రాలేదన్నారు. టిడిపి హయాంలో 2016-19 మధ్య ఇళ్లు నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారులకు చెల్లించాల్సిన రూ.3,800కోట్లు జగన్‌మోహన్‌రెడ్డి చెల్లించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తమకు పట్టాలు ఇచ్చారుగాని స్థలం చూపలేదని, పట్టా ఇచ్చారగాని ఇళ్లు మంజూరు చేయలేదని పలువురు లబ్దిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో విఆర్‌ఒ, సర్వేయర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌లు కలిసి ఒక కమిటీగా ఏర్పడి దీనిపై పూర్తిస్థాయిలో వారం రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. లేఅవుట్‌లో తమకు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఫిర్యాదు చేయగా ఆర్‌డబ్ల్యూఎస్ జెఇ చైతన్యకు తాగునీరు అందించాలని సూచించారు. 2014-19 టిడిపి హాయంలో, 2019-24 వైసిపి ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఇళ్లు నిర్మాణాలను మార్చి 15లోగా పూర్తిచేసిన ప్రతి లబ్దిదారునికి డబ్బులు చెల్లిస్తామన్నారు. ఇళ్లు నిర్మాణం చేపట్టే లబ్దిదారులకు ఉచితంగా ఇసుకను అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గృహ నిర్మాణశాఖ పీడీ, మండల ప్రత్యేకాధికారి బి.నగేష్, తహశీల్దార్ రమేష్‌కుమార్, ఎంపిడిఒ సీపాన హరిహరరావు, ఇఒ మోహన్‌బాబు, టిడిపి మండల అధ్యక్షుడు చిగిలిపల్లి రామ్మోహనరావు, టిడిపి నాయకులు అనకాపల్లి శ్రీరంగనాయకులు, అన్నెపు రాము, బాడాన శేషగిరి, సీపాన శ్రీరంగనాయకులు, బలగ శంకర భాస్కరరావు, మండలస్థాయి అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు. రణస్థలం రూరల్: మండలంలోని రణస్థలం పంచాయతీ పరిధిలో మన ఇల్లు – మన గౌరవం లబ్ధిదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ నందిగాం ప్రసాదరావు, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ ధనుంజయరావు, హౌసింగ్ ఎఇ మోహనరావు, మాజీ ఎంపిపి డిజిఎం ఆనందరావు, సర్పంచ్ పిన్నింటి భానోజీనాయుడు, కూటమి నాయకులు లెంక శ్యాం, పిసిని జగన్నాధం నాయుడు, పైడి అప్పుడుదొర, ముక్కు ఆదినారాయణ, నారాయశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.బూర్జ: ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో లబ్ధిదారులు తమ గృహాలు పూర్తి చేసుకోవాలని ఎంపిడిఒ పి.తిరుపతిరావు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి విజయలక్ష్మి, హౌసింగ్ ఎఇ పి.లక్ష్మీనారాయణ, కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఎం.రాంప్రసాద్, గృహ లబ్ధిదారులు, మార్పెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు సీతారాం బాబు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.ఆమదాలవలస : మండలంలోని గరిమెళ్ల కొత్తవలసలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, జిల్లా ఉద్యానవనశాఖాధికారి ఆర్.వి.వి.ప్రసాద్, ఎంపిడిఒ ఎస్.వాసుదేవరావు, ఇఒపిఆర్‌డి డి. గోవిందరావు, హౌసింగ్ ఎఇ ధర్మేంద్ర, టిడిపి నాయకులు కోరుకొండ వెంకటరమణ, కార్యదర్శి, వర్క్ ఇన్స్‌స్పెక్టర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పాతపట్నం : మండలంలోని పంచాయతీ ఎన్‌టిఆర్ కాలనీలో శనివారం నిర్వహించిన మన ఇల్లు – మన గౌరవంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి గృహాలు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తామని హామీనిచ్చారు. తాను సొంత గ్రామం సిదిలో ఉంటన్న ఇల్లు కూడా అప్పట్లో వచ్చిన కాలనీ ఇల్లే అని తెలియజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మంచు కరుణాకరరావు, తహశీల్దార్ కిరణ్‌కుమార్, ఎంపిడిఒ ఫణీంద్రకుమార్, హౌసింగ్ డిఇ వై. నర్సింహరావు, ఎఇ సీతారామరాజు, టిడిపి మండల అధ్యక్షులు పైల బాబ్జి, సతీష్, సర్పంచ్ ప్రభాకరరావు పాల్గొన్నారు. మెళియాపుట్టి : మండలంలోని మెళియాపుట్టి, వసుంధర, పెద్దపద్మాపురం, చాపర గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీల్లోని ఇళ్లను పలాస వ్యవసాయ శాఖ ఎడి, మండల స్పెషల్ ఆఫీసర్ లింగాల మధుబాబు అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఎస్.మోహనరావు, మండల టిడిపి మాజీ అధ్యక్షులు అనపాన రాజశేఖర్‌రెడ్డి తహశీల్దార్ ఎన్.హనుమంతరావు, ఎంపిడిఒ పడాల చంద్రకుమారి, హౌసింగ్ ఎఇ శ్రీనివాసరావు, తెలుగు యువత మండల అధ్యక్షులు బసవ పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.నందిగాం : మండలంలోని నందిగాంలో 17 పంచాయతీలకు సంబంధించి మన ఇల్లు…మన గౌరవం కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాధికారి పి.శ్రీనివాసరావు నిర్వహించారు. కార్యక్రమంలో డిటి భాగ్యలక్ష్మి, ఎఒ శ్రీకాంత్ వర్మ, ఎపిఒ నాగరాజు, హౌసింగ్ ఎఇ దినేష్ పాల్గొన్నారు. పలాస : మండలంలోని టెక్కలిపట్నం పంచాయతీల్లో ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు పంచాయతీ ప్రత్యేకాధికారి పోతనపల్లి చంద్రవేఖర్, ఎంపిడిఒ ఎన్.రమేష్ నాయకుడు అవగాహన కల్పించారు. సమావేశంలో సర్పంచ్ ప్రతినిధి పి.కృష్ణారావు, కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.