ఎస్‌సి కులగణనపై 12 వరకు అభ్యంతరాల స్వీకరణ

ఎస్‌సి కులగణన

స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, కలెక్టర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఎస్‌సి కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్‌ ప్రక్రియ) స్వీకరణ గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఏడో తేదీతో గడువు ముగియనుండడంతో మరో ఐదు రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఎస్‌ఒపి విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జిఒ విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ వరకు కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా ఈనెల 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని తెలిపారు. అనంతరం అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను ఈనెల 20వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని పేర్కొన్నారు. మండల ప్రత్యేకాధికారులు సంబంధిత ప్రక్రియను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు.

➡️