మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి:
గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని సౌడాంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేలకోట్ల రూపాయలు విద్యుత్‌పై అప్పులు తెచ్చారని, ఇప్పుడు విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడుతుందని అన్నారు. టిడిపి హయాంలో వేసిన రోడ్లు, డ్రెయినేజీ తప్ప వైసిపి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి పట్ట సింహాచలం పాల్గొన్నారు. లావేరు: ప్రతిఒక్కరికి జాబ్ కార్డు మంజూరు చేసి, పని కల్పించడం జరుగుతుందని ఎంపిడిఒ కుప్పులి సురేష్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని గురుగుబిల్లిలో సర్పంచ్ బాడిత కళ్యాణి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. తొలుత గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎంపిడిఒ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో ప్రతిఏటా ప్లానింగ్ గ్రామసభ నిర్వహించు కోవడం, అభివృద్ధి పనులు గుర్తింపు వంటి పనులు చేసేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 30 లోపల గ్రామసభలు నిర్వహిస్తామని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరం గుర్తించే పనులు ఎన్నిరోజులు పనిధినాలు కల్పించారనే విషయం గ్రామ సభలో చదివి వినిపించారు అర్హులైన వారి అందరికి జాబ్ కార్డులు మంజూరు తదితర విషయాలు తెలిపారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి ఇఒపిఆర్‌డి ఈశ్వరరావ,ు సర్పంచ్ ప్రతినిధి బడిత లక్మణరావు చిట్టిబాబు హరికష్ణ ఉపాధిహామీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు