త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలి

త్వరిగతిన అర్జీలను

వినతిపత్రాలను స్వీకరిస్తున్న డిఆర్‌ఒ వెంకటేశ్వరరావు

  • డిఆర్‌ఒ వెంకటేశ్వరరావు’
  • మీకోసం’లో 142 వినతులు

శ్రీకాకుళం అర్బన్‌ : త్వరిగతిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు సూచించారు. జెడ్‌పిలో సోమవారం మీకోసం నిర్వహించిన కార్యక్రమం లో 142 వినతులను స్వీకరించారు. పొందూరు మండలం పిల్లలవలసలో భూగర్భజలాలు కలుషితం కావడంతో కిడ్నీ వ్యాధులు విజృంభించడంతో ప్రజలు రోగగ్రస్తులవుతు న్నారని చెన్నకేశవరావు, ఈశ్వరరావు రాంబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 14 మంది వరకు మృతి చెందారని వివరించారు. మృతుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు లోపు వారేనని అన్నారు. ప్రస్తుతం 20 మంది కిడ్నీ బ్యాధితో బాధపడుతున్నారని, ఐదురుగు డయాలసిస్‌ దశలో ఉన్నారని తెలిపారు. గ్రామాన్ని కిడ్నీ మహమ్మారి నుంచి కాపాడేందుకు తక్షణమే ఆర్‌ఒ ప్లాంటును నెలకొల్పాలని కోరారు. మెళియాపుట్టి మండలం సిరియాకండి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న బోకర పార్వతిని రాజకీయ కారణాలతో అర్ధాంతరంగా తొలగించారని ఆమె భర్త చిన్నవాడు ఫిర్యాదు అందజేశాడు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వద్ద పెద్దఎత్తున అక్రమ పద్ధతిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, దీనివల్ల రోడ్లు పూర్తిగా పాడుతున్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. హిరమండలం మండలం జొన్నలవలస పరిధిలో 1బిలు రావడం లేదంటూ పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. మాకన్నపురం ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి పనిలో లేని వారి పేరుతో మస్టర్లు వేసి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌రాజు,ఉప కలెక్టర్‌ అప్పారావు పాల్గొన్నారు. 15 మందికి కారుణ్య నియామకాలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ వివిధ కారణాలతో మృతి చెందిన 15 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టారు. ఆర్‌టిసిలో ఏడుగురికి, సచివాలయా ల్లో పనిచేస్తూ… మృతి చెందిన 8 మంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలు డిఆర్‌ఒ అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ బి.మీనాక్షి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కళ్యాణ్‌ బాబు, డ్వామా పీడీ సుధాకర్‌, ఐసిడిఎస్‌ పీడీ శాంతిశ్రీ, జిల్లా ఉద్యాన అధికారి ఆర్‌.వర ప్రసాద్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఇ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

➡️