కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు

వచ్చే నెల నాలుగో తేదీన చేపట్టనున్న సార్వత్రిక

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

వచ్చే నెల నాలుగో తేదీన చేపట్టనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద సిసి టివి కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.కౌంటింగ్‌కు సంబంధించి సిబ్బంది ఎంపిక, వారికి పలు దశల్లో శిక్షణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో టేబుళ్ల ప్లాన్‌ పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ సూచన ప్రకారం ప్రతి టేబుల్‌లో మైక్రో అబ్జర్వర్‌, కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లు ఉండేలా చూడాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సిబ్బందికి, ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. శివానీ కాలేజీలోని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ముందస్తు ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, అధికారుల మధ్య పూర్తి సమన్వయం కారణంగా జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, రిటర్నింగ్‌ అధికారులు నూరుల్‌ కమర్‌, భరత్‌ నాయక్‌, సిహెచ్‌.రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్‌, సుదర్శన్‌ దొర, అప్పారావు, జెడ్‌పి సిఇఒ వెంకటేశ్వరరావు, సిపిఒ ప్రసన్నలక్ష్మి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సూర్యకిరణ్‌, జిల్లా ఆడిట్‌ అధికారి సుల్తానా, డిటిసి చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, డిపిఒ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌ కుమార్‌, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, సమగ్ర శిక్ష పిఒ ఆర్‌.జయప్రకాష్‌, ఎపిఎంఐపి పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️